సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. ఘటోత్సవంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉదయం 4 గంటలకు మహా హారతి, కుంకుమ, పుష్ప అర్చనలు జరిగాయి. ఆదివారం ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో అమ్మ వారికి బోనం సమర్పిస్తున్నారు. తొలి బోనం రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమర్పించారు. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు. ఉదయం 9 గంటల నుంచి ముఖ్యలు, మంత్రులు వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి, అమ్మ వారిని దర్శించుకొని, బోనం సమర్పించారు.
ఇక భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. రంగు రంగులలతో తొట్టెలు కూడా ఏర్పాటు చేశారు. పోతరాజులు డప్పులతో డ్యాన్సులు చేస్తున్నారు. బోనాల సందర్భంగా బందోబస్తు నిమిత్తం 3 వేల మందిని డ్యూటీలో వుంచారు. ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో తరలి వస్తారు కాబట్టి షీటీమ్స్ ను కూడా డ్యూటీలో వుంచారు. ఇక.. ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా ఉజ్జయినీ మహకాళి ఆలయానికి బస్సులు నడుపుతోంది.