ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత్ తో సహా నాలుగు దేశాల్లో తమ రాయబారులను తొలగించారు. అయితే.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని మాత్రం తెలియడం లేదు. జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే హంగేరీ, భారత్ దేశాల రాయబారులను వెనక్కి పిలిచినట్లు అధ్యక్షుడి వైబ్ సైట్ లో పేర్కొన్నారు.
ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని జెలెన్ స్కీ తెగ ప్రయత్నాలు చేశారు. అయితే అత్యధిక దేశాలు రష్యాకు వ్యతిరేకంగానే వ్యాఖ్యలు చేశాయి. కొన్ని దేశాలు మాత్రం రష్యా వైపు వున్నాయి. సరిగ్గా.. అదును చూసి.. ఉక్రెయిన్ అధ్యక్షుడు రాయబారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.