ఇంటర్ ఫలితాల్లో అవిభక్త కవలలైన వీణ-వాణిలు ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. వీణ 712 మార్కులు సాధించగా, వాణి 707 మార్కులు సాధించింది. ఫస్ట్ క్లాసులో పాసైన ఈ కవలలను రాష్ట్ర గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరికీ వీరు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
మున్ముందు కూడా ఇదే రకమైన విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. వీరి విజయం అందరికీ ఆదర్శంగా నిలవాలని, అందరికీ మానసిక స్థైర్యం ఇవ్వాలని మంత్రి కోరుకున్నారు. ఇక.. కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు.