బీజేపీ వ్యవస్థీకృత మార్పులు చోటుచేసుకున్నాయి. బీజేపీ పార్లమెంటరీ బోర్డుతో పాటు సెంట్రల్ ఎలక్షన్ కమిటీని పునర్యువస్థీకరించారు. పార్లమెంటరీ బోర్డు నుంచి బీజేపీ కీలక నేతలైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌లను తప్పించారు. కొత్తగా ఆరుగురిని చేర్చుకున్నారు. వీరిలో కర్ణాటక మాజీ సీఎం యొడియూరప్ప, సుధాయాదవ్, సత్యనారాయణ జతియా, కె.లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్ లాల్‌పురా ఉన్నారు. పార్లమెంటరీ బోర్డులో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయా ధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉంటారు. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో కొత్తగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్, కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌లను తీసుకువచ్చారు. పార్లమెంటరీ బోర్డులో ఉన్నవారందరూ ఎలక్షన్ కమిటీలో కూడా సభ్యులుగా ఉంటారు. అయితే బోర్డులో యోగి ఆదిత్యనాథ్‌కు చోటు దక్కలేదు.
