హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అంబర్‌పేట నియోజకవర్గంలో విస్తృత పర్యటన చేశారు. 119 నియోజవర్గాలకు సంబంధించి బీజేపీ అధిష్ఠానం కీలక నేతలకు ఆప్పగించింది. బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవ్ ప్రసాద్ మౌర్య మాట్లాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కన్నె ఉమా రమేశ్, యాదవ్, బి పద్మ వెంకట్ రెడ్డి, అమృత, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. బాగ్ అంబర్‌పేట డివిజన్‌లోని దళిత నాయకుడు అజయ్ కుమార్ ఇంట్లో కేశవ్ ప్రసాద్ మౌర్య భోజనం చేశారు. వారి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆయనకు మంగళహారతులతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు.
