రామ్ చరణ్ భార్య కామినేని ఉపాసన ఇంట విషాదం నెలకొంది. ఆమె నానమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. నానమ్మ ఇచ్చిన ప్రేరణను తాను జీవితాంతం గుర్తుంచుకుంటానని తెలిపింది. నానమ్మ చివరి వరకు ఎంతో కృతజ్ఞత, గౌరవం, ప్రేమ, సానుభూతి నిండిన జీవితాన్ని గడిపారని గుర్తు చేసుకుంది. ఆమె వల్లనే జీవితం ఎలా గడపాలో నేర్చుకున్నానని పేర్కొంది. నానమ్మే తనను పెంచి పెద్ద చేసిందని, మా నాన్నమ్మ, తాతయ్యల నుంచి ఎలాంటి ప్రేమానురాగాలను పొందానో.. ఆ అనుభవాలు, అనుభూతులన్నింటినీ నా పిల్లలలకు అందేలా చూస్తానని మాటిస్తున్నానని తెలిపింది. నానమ్మ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు ఉపాసన పేర్కొంది.
https://twitter.com/upasanakonidela/status/1617376245783867394?s=20&t=XqMSPOFwAYZU484aBtbTzg