బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా జంటకు రాంచరణ్ సతీమఫి ఉపాసన క్షమాపణలు చెప్పారు. వీలు కాకపోవడం వల్లే పెళ్లికి హాజరు కాలేదని, సారీ అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు కియారా తన పెళ్లి ఫొటోలను ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో ఉపాసన ఆ కొత్త జంటకు కంగ్రాట్స్ చెప్పారు. మీ జోడీ చూడచక్కగా వుంది. పెళ్లికి మేము హాజరు కాలేకపోయాం. సారీ… మీ ఇద్దరికీ మరోసారి మా అభినందనలు అంటూ ఉపాసన పేర్కొన్నారు. బాలీవుడ్ ప్రేమ జంట కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా పెళ్లిబంధంతో ఒక్కటైంది. ఫిబ్రవరి 7 న వీరిద్దరూ ఏడడుగులు నడిచారు. ఈ సందర్భంగా ఈ జంటకు సినీ తారలు శుభాకాంక్షలు తెలిపారు.
