భారతీయ మహిళలను పట్టిపీడిస్తున్న క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఆడవారికి తరచూ వచ్చే క్యాన్సర్లలో ఇది ఒకటి. ఇప్పుడు దీనిపై విజయం సాధించబోతున్నాం. దేశంలోనే తొలి క్వాడ్రివలెంట్ హ్యుమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ కి భారత డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆమోదం తెలిపింది. పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశీయంగా చేస్తున్న సర్వావ్యాక్ టీకా ఈ నవంబర్ కల్లా అందుబాటులోకి రానుంది.
కేవలం మన దేశంలో అభివృద్ధి చేస్తున్న కొత్త టీకాయే కాకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన మరో 4 టీకాలు కూడా అందుబాటులో వున్నాయి. ఆ టీకాలకు మన దేశంలో ఒక్కో వ్యక్తికి కనీసం 5 వేల నుంచి 8 వేల దాకా ఖర్చవుతుంది. కానీ.. మన దేశంలో తయారైంది తక్కువ ధరతో అందుబాటులో వుంటుంది. 12 ప్రాంతాల్లో 9 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్సులోని 2 వేల మందిపై ఈ టీకాను ప్రయోగించి చూశారు. మూడు విడతలుగా ప్రయోగాలు సాగాయి. వైరస్ నిరోధతకు అవసరమైన ప్రాథమి కస్థాయి కన్నా 1000 రేట్లు ఎక్కువగా ఈ టీకా పనిచేస్తుందని పరీక్సల్లో తేలింది. టీకా తీసుకున్న వారందరూ కూడా సంతోషంగా వున్నారనీ తేలింది.