టీడీపీ నేత నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో వంగవీటి రాధ పాల్గొన్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరులో నారా లోకేశ్ యాత్ర సాగుతోంది. ఈ నేపథ్యంలో నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ వంగవీటి రాధ పాల్గొన్నారు.. అంతకుముందు లోకేష్ తో కాసేపు ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లోకేష్ ను పాదయాత్రలో కలిసేందుకు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లిన వంగవీటి రాధా… ముందుగా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం పాదయాత్రలో తనతో పాటు వచ్చిన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. అయితే… వంగవీటి రాధా టీడీపీని వీడుతున్నారన్న ప్రచారం బాగా జరుగుతోంది. అతి త్వరలోనే వంగవీటి రాధ జనసేనలో చేరనున్నట్లు ప్రచారంలో వుంది. ఈ ప్రచారం నేపథ్యంలోనే వంగవీటి రాధా పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ ను కలుసుకొని, పాదయాత్రలో పాల్గొన్నారు. ఇకనైనా వంగవీటి పార్టీ మారుతున్నారన్న వార్తలు ఆగుతాయో మరి చూడాలి.