ఇప్పటి వరకూ అటు విమానాశ్రయాల్లో గానీ.. రైల్వే స్టేషన్లలో గానీ.. ఏవైనా ప్రకటనలు చేస్తే ఆంగ్లం, హిందీ భాషలోనే చేసేవారు. కానీ.. యోగి సారథ్యంలోని యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ కు సంబంధించిన ప్రకటన ఇక సంస్కృతంలో వస్తుంది. ఇకపై కోవిడ్ 19 కి సంబంధించిన ప్రకటనలు సంస్కృతంలో కూడా వినిపిస్తారు.
హిందీ, ఇంగ్లీష్ తో పాటు సంస్కృతంలో కూడా వస్తుంది. ఈ మేరకు విమానాశ్రయ అధికారులు ట్వీట్ కూడా చేశారు. విమానాశ్రయంలో ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇలా చేయడం ద్వారా తమ మూలాల్లోకి వచ్చేశామని, వారణాసిలోకి అడుగు పెట్టామన్న భావన ప్రయాణికుల్లో వచ్చేస్తుందని అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ నిర్ణయంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. మరి కొందరు ఎవరికి అర్థమవుతుంది? అంటూ ప్రశ్నించారు. సంస్కృతం మృత భాష అని, ఎవరికి అర్థమవుతుందని ప్రశ్నించారు. పాలీ, పారక్రిత్ లో కూడా చెప్పాలని మరి కొందరు ట్వీట్ చేస్తున్నారు.
अब #भाविप्रा वाराणसी विमानतल पर अंग्रेजी और हिंदी के बाद संस्कृत में भी कोविड मानदंडों की घोषणा की जा रही है|
हमारे सम्मानित यात्रियों को विमानतल पर
आते ही महसूस हो जाएगा कि वे काशी – संस्कृत भाषा के पीठ स्थान में प्रवेश कर चुके हैं|@AAI_Official @aaiRedNR pic.twitter.com/E0RcD3LfSS— VARANASI AIRPORT (@AAIVNSAIRPORT) June 17, 2022