ఎప్పుడూ విభిన్న కథాంశాలు ఎన్నుకునే హీరో వరుణ్ సందేశ్. విభిన్న కథాంశాలే కాదు.. విభిన్న పాత్రలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ సాగిపోతుంటాడు. తాజాగా యద్భావం తద్భవతి అన్న ఓ విభిన్న కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనికి రమేశ్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఆనయ సుల్తానా హీరోయినగా నటిస్తోంది. అయితే.. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ లో వరుణ్ సందేశ్ విచిత్రంగా కనిపిస్తున్నారు. మాస్ కు రీచ్ అయ్యేలా కనిపిస్తున్నాడు. దీనిపై హీరో వరుణ్ సందేశ్ కూడా స్పందించాడు.
పోస్టర్ రిలీజ్ చేసినందుకు ఆనందంగా వుంది. సందీప్ కిషన్ కుథ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన నిర్మాత భూమి గారికి, దర్శకుడికి ధన్యవాదాలు అని వరుణ్ సందేశ్ పేర్కొన్నారు. ఈ అక్టోబర్ వస్తే తన తొలిచిత్రం హ్యాపీడేస్ విడుదలై 15 సంవత్సరాలైంది. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన వారందరికీ ధన్వవాదాలు తెలిపారు. శరత్ శ్రీకంఠం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాకు వున్నారు. మిహిరమ్స్ సంగీతాన్ని ఇస్తున్నాడు. కల్యాణ్ శ్యామ్ కెమెరామెన్. షావోలిన్ మల్లేశ్ ఫైట్ మాస్టర్. కోరియోగ్రాఫర్ సురేశ్ వర్మ. అయితే.. సినిమా తేదీని మాత్రం యూనిట్ ఇంకా చెప్పలేదు.