చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి మళ్లీ రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కనిపించాడు. నెక్ట్స్ సినిమాను ఆయన ఒప్పుకున్నాడా? మళ్లీ తెరపై ఏ సినిమాలో కనిపిస్తాడు? అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. అయితే.. ఇకపై తాను సినిమాలు చేయనని, రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతానని ప్రకటించాడు. అయితే.. ఆయన ఏ సమయంలో రాజకీయ అరంగేట్రం చేస్తారో ప్రకటించలేదు. అయితే.. రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ అవ్వగానే వేణుకు ఓ సినిమా ఛాన్స్ వచ్చిందట. మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబీ 28 లో ఓ కీలక పాత్ర కోసం అడిగారట. అయితే.. అధికారికంగా మాత్రం దీనికి సంబంధించిన ఎలాంటి వార్తా లేదు. దీనిలో నటించేందుకు వేణు ఒప్పుకుంటే.. సెకండ్ ఇన్నింగ్స్ భలే వుంటుంది.
