త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరేసింది. త్రిపురలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలుండగా… ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 31 మేజిక్ ఫిగర్ దాటాలి. అయితే… బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దాటిపోయి 33 స్థానాలను దక్కించుకుంది. ఇక.. కాంగ్రెస్- వామపక్షాల కూటమి 14 చోట్ గెలుపొందింది. అయితే… తిప్రా మోథా పార్టీ 13 చోట్ల జయ కేతనం ఎగరవేయం గమనార్హం.
ఇక… నాగాలాండ్ లో NDPP తో కలిసి సంకీర్ణ ప్రభుత్వంలో వున్న కమలం.. ఈ సారి కూడా అక్కడ అధికారాన్ని నిలబెట్టుకుంది. మొత్తంగా 60 స్థానాలుండగా… BJP-NDPP 38 స్థానాలను కైవసం చేసుకుంది. NPP 4, NPF2, ఇతరులు 16 స్థానాల్లో జయ కేతనం ఎగరేశారు. ఇక… ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పాటుకానుంది.
అయితే.. మేఘాలయాలో మాత్రం NPP అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. గత ఎన్నికల్లో NPP నేత కాన్రాడ్ సంగ్మా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే.. ఎన్నికల సమయంలో ఈ బంధాన్ని తెంచుకున్నారు. దీంతో ఒంటరిగానే NPP బరిలోకి దిగింది. మెజారిటీ మార్కకుకు కాస్త దూరంలోనే ఆగిపోయింది. 22 స్థానాలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది.