అద్భుతమైన డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, యంగ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. విజయ్ దేవర కొండ హీరో కావడంతో అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు చెందిన పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో చిత్రం యూనిట్ బిజీగా వుంది. ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. సిక్స్ ప్యాక్ బాడీతో కొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చాడు. నా సర్వస్వాన్ని ధారబోసి సినిమాను తీశాను. అటు మానసికంగా, శారీరకంగా, నటన ప్రదర్శన పరంగా కూడా నా రోల్ చాలా ఛాలెంజ్ తో కూడుకున్నది. అతి త్వరలోనే మీకన్నీ చెబుతాను అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.
A Film that took my everything.
As a performance, Mentally, physically my most challenging role.I give you everything!
Coming Soon#LIGER pic.twitter.com/ljyhK7b1e1— Vijay Deverakonda (@TheDeverakonda) July 2, 2022