అడవి శేష్ నటించిన మేజర్ సినిమాపై లేడీ అమితాబ్ విజయశాంతి ప్రశంసలు కురిపించారు.దేశం పట్ల సైనికులకు వుండే బాధ్యతను, సైన్యంలో చేరే పౌరులకు ఉండే జాతీయ భావాల నిస్వార్థపూరిత స్ఫూర్తిని స్పష్టంగా చెప్పిన మరో సినిమా మేజర్ అంటూ విజయ శాంతి ట్వీట్ చేశారు. ప్రజా శ్రేయస్సుని, అంకితభావంతో, నిజాయితీగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు ఎప్పుడూ ప్రశంసనీయమే అంటూ విజయ శాంతి ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇక.. మరో సినిమాపై కూడా విజయశాంతి ట్వీట్ లో స్పందించారు. సూర్య హీరోగా నటించిన తాజా చిత్రం ఎదుర్ కుం తునిందవన్ సినిమాపై కూడా స్పందించారు. ఇందులో మానవ సంబంధాల విలువలని చూపించారని, సమాజంపై ఉండాల్సిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును, మానవతా ధోరణి, భావోద్వేగాలు ఈ చిత్రంలో కనిపిస్తాయని విజయశాంతి ట్వీట్ చేశారు.
ఎదుర్కుం తునిందవన్…
మేజర్…
ఈ మధ్య కొంచెం సమయ విరామ అవకాశంలో చూసిన చిత్రాలలో మానవ సంబంధాల విలువని, సమాజంపై ఉండవలసిన వివేచనాత్మక వ్యక్తిత్వ తీరును, మనుషుల మధ్య ఉండవలసిన మానవతా ధోరణిని, భావోద్వేగాలను ఒక చిత్రం… pic.twitter.com/BXarIPeEwJ
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 14, 2022