బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌శాఖలో ప్రముఖుల చేరికలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు బీఆర్‌ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు.విజయవాడ మాజీ మేయర్ తాడి శకుంతలతో పాటు మహిళా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు మేఘవరపు వరలక్ష్మి , ఓబీసీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి , పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌లోకి మరిన్ని చేరికలు ఉంటాయని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాల్లోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుందని అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
