Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ : ఎంవోయూ పూర్తి వివరాలివిగో…

విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇతర పారిశ్రామికవేత్తలు జ్యోతి ప్రజ్వలనతో దీనిని ప్రారంభించారు. ఏపీలో పారిశ్రామిక అవకాశాలు, భవిష్యత్తులో పెట్టుబడులపై కీలక ప్రసంగాలు చేశారు. రాబోయే రోజుల్లో పెట్టనున్న భారీ పెట్టుబడులపై ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేవారు. ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.

తొలి రోజు 92 ఎంవోయూలు వచ్చాయని, మొత్తం 340 ఎంవోయూలు రానున్నాయని ప్రకటించారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రకటించారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారబోతోందన్నారు. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయన్నారు. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలమన్నారు. 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతమని వివరించారు. పోర్టులకు సమీపంలో పుష్కలంగా భూములున్నాయని వివరించారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని పునరుద్ఘాటించారు.

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలున్నాయని వివరించారు. సంక్షేమం, డెవలప్ మెంట్ కి ప్రాధాన్యతనిస్తూ… పాలన సాగిస్తున్నామన్నారు. ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. సీఎం జగన్ సారథ్యంలో బలమైన నాయకత్వం వుందన్నారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ… ఏపీలో సహజ వనరులు పుష్కలంగా వున్నాయన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవ లేదన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని వివరించారు.

రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ… సమ్మిట్ లో భాగమైనందుకు ఆనందంగా వుందన్నారు. నూతన భారత నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతోందని, ఏపీలో జియో నెట్ వర్క్ అద్భుతంగా వుందన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రగతికి ఏపీ సర్కార్ సహకారం అందిస్తోందని అన్నారు. ఏపీలో వనరులు పుష్కలంగా వున్నాయని, పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వున్నారని పేర్కొన్నారు. ఏపీలో 10 గిగావాట్ల సోలార్ ఎనర్జీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… ఏపీ పారిశ్రామిక వృద్ధిలో రోడ్ కనెక్టివిటీ కీలకమని తెలిపారు. పోర్టులతో రహదారుల ను కనెక్టివిటీ బలోపేతం చేస్తాయని వివరించారు. పరిశ్రమలకు లాజిస్టిక్ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యమన్నారు. ఏపీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయని వెల్లడించారు. రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు 20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

అంబానీ, బిర్లా వంటి 30 కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు ఇలా వున్నాయి.

NTPC -2,35,000
ABC limited – 1.20 లక్షల కోట్లు
రెన్యూ పవర్ – 97,550 కోట్లు
ఇండోసాల్ – 76,033 కోట్లు
ఏసీఎమ్ ఈ – 68,976 కోట్లు
టీఈపీఎస్ఓఎల్ – 65,000 కోట్లు
జేఎస్ డబ్ల్యూ గ్రూప్ – 50, 632కోట్లు
హంచ్ వెంచర్స్ – 50 వేల కోట్లు
అవాదా గ్రూప్ – 50 వేల కోట్లు
గ్రీన్ కో – 47,600 కోట్లు
ఓసీఐఓఆర్ – 40 వేల కోట్లు
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ – 30,000 కోట్లు
వైజాగ్ టెక్ పార్క్ – 321,844 కోట్లు
అదానీ ఎనర్జీ గ్రూప్ – 21,820 కోట్లు
ఎకోరెన్ ఎనర్జీ – 15,500 కోట్లు
సెరంటికా – 12,500 కోట్లు
ఎన్ హెచ్ పీసీ – 12,000 కోట్లు
అరబిందో – 10,365 కోట్లు
ఓ2 పవర్- 10 వేల కోట్లు
ఏజీపీ సిటీ గ్యాస్ – 10,000 కోట్లు
జేసన్ ఇన్ ఫ్రా – 10,000 కోట్లు
జిందాల్ స్టీల్ – 7500 కోట్లు
టీసీఎల్ – 5,500 కోట్లు
ఏఎం గ్రీన్ ఎనర్జీ – 5,000 కోట్లు
ఉత్కర్ష అల్యుమినియం – 4,500 కోట్లెు
ఐపోసీఎల్ – 4,300 కోట్లు
వర్షిణి పవర్ ఎంవోయూ – 4,200 కోట్లు
ఆశ్రయం ఇన్ ఫ్రా – 3,500 కోట్లు
మైహోమ్ – 3,100 కోట్లు
వెనికా జల విద్యుత్ – 3000 కోట్లు
డైకిన్ – 2,600 కోట్లు
సన్నీ ఓపోటెక్ – 2,500 కోట్లు
భూమి వరల్డ్ – 2,500 కోట్లు
అల్ట్రాటెక్ 2,500 కోట్లు
మెండాలేజ్ – 1,600 కోట్లు
అప్లజ్ ఎనర్జీ – 1,500 కోట్లు
గ్రిడ్ ఎడ్జ్ వర్క్- 1,500 కోట్లు
టీవీఎస్ – 1,500 కోట్లు
హైజెన్ కో – 1,500 కోట్లు
డ్రీమ్ వ్యాలీ గ్రూప్ – 1,080 కోట్లు
భ్రమరాంబ గ్రూప్ – 1,038 కోట్లు
మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ – 1,000 కోట్లు
శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్ – 1,000 కోట్లు
సెల్ కాన్ – 1,000 కోట్లు
తుని హోటల్స్ – 1,000 కోట్లు
విష్ణు కెమికల్స్ – 1,000 కోట్లు

Related Posts

Latest News Updates