త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన చేస్తామని, విశాఖే పరిపాలన రాజధాని అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. పెట్టుబడుల పరంగానే కాకుండా… పెట్టుబడులకే కాదు.. ప్రకృతి అందాలకు కూడా విశాఖ నెలవుగా వుందన్నారు. 947 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీకి సొంతమన్నారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ ప్రసంగించారు. ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని గర్వంగా ప్రకటిస్తున్నామన్నారు. 340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయని, తొలిరోజు 92 ఎంవోయులు రాగా.. మొత్తం 340 ఎంవోయూలు వస్తాయన్నారు. దీని ద్వారా 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారిందని, ఏపీలో కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ప్రకటించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3 సంవత్సరాలు నెంబర్ 1 గా నిలిచామన్నారు.
విశాఖపట్నం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనిని ప్రారంభించారు. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, కుమార మంగళం బిర్లా, టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సియాంట్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి, గ్రంథి మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాళ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రారంభ సదస్సు జరగనుంది. ఇక.. మొదటి రోజే 92 ఎంవోయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. 20 రంగాల్లో, 340 సంస్థలు పెట్టుబడులకు ఓకే చెప్పాయి. ఈ సమ్మిట్ కి 45 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. మొదగటగా… ఏపీ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ అన్న గీతంతో కార్యక్రమం ప్రారంభించారు.
రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ (AU Engineering College) ఆవరణలో ఏర్పాట్లు జరిగాయి. సదస్సుకు పలు దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరుకానున్నారు. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామిక వేత్తలు () మాట్లాడనున్నారు.