విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 9 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్ ఎస్ఎంఎస్-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఆరుగురు ఒప్పంద కార్మికులు, ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగులు కాగా… మరొకరు డీజీఎం స్థాయి అధికారి వున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందజేశారు. ఫ్లాగ్ యాష్ ను, తొలగించే క్రమంలో, నీళ్లు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడినవారిలో 9 మందికి ప్రథమ చికిత్స అనంతరం విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రి కి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరికి స్టీల్ ప్లాంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
