విశ్వక్ సేన్, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం 7 #VS10 అనౌన్స్ మెంట్- గ్రాండ్ గా ప్రారంభం
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ విభిన్నమైన జోనర్‌ల సినిమాలతో అలరిస్తున్నారు. తన 10వ సినిమా కోసం, నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడితో కలిసి విశ్వక్ సేన్ చేతులు కలిపారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.
అందరి దృష్టిని ఆకర్షించే పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ రోజు #VS10ని అధికారికంగా అనౌన్స్ చేశారు. పలువురు ప్రత్యేక అతిథులు సమక్షంలో ఈ చిత్రం ఈరోజు గ్రాండ్‌గా ప్రారంభమైంది.
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రామ్ తాళ్లూరి భార్య రజనీ క్లాప్ ఇవ్వగా, రచయిత, దర్శకుడు మచ్చ రవి కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు రవితేజ ముళ్లపూడి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు. అంతకుముందు రామ్ తాళ్లూరి ప్రొసీడింగ్స్ ప్రారంభించడానికి దర్శకుడికి స్క్��