కశ్మీర్ ఫైల్స్ తీసి, హిందువుల దీనస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించిన సంచలన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా పుటల్లోకెక్కారు. ఆయన తాజాగా.. బాలీవుడ్ స్టార్ హీరలోపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కింగ్స్, బాద్ షాలు, సుల్తాన్లు వున్నంత కాలం బాలీవుడ్ మునిగిపోతూనే వుంటుందంటూ సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ప్రజల గాథలతో సినిమాలు తీసి, బాలీవుడ్ ను ప్రజల పరిశ్రమగా మార్చాలని, అది మాత్రమే ప్రపంచ చలనచిత్ర పరిశ్రమగా మారుతుంది అంటూ వివేక్ అగ్నిహోత్రి సంచలన ట్వీట్ చేశారు. అయితే.. ఈ ట్వీట్ ద్వారా షారూఖ్, సల్మాన్ ఖాన్ లను పరోక్షంగా అగ్నిహోత్రి విమర్శించారని అభిప్రాయపడుతున్నారు.
