హీరో నితిన్, రష్మిక మందన్నా కాంబినేషన్ తో VNRTrio అనే కొత్త సినిమా రాబోతోంది. దీనిని వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. VNRTrio పూజాకార్యక్రమాలతో ప్రారంభం కాగా.. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి (chiranjeevi) క్లాప్ కొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.ఈ చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
