రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను కలిసేందుకు తాము సిద్దంగా లేమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమను కలిసేందుకు వచ్చి కేసీఆర్‌ను కలవాలనుకున్నా, కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చి తమను కలవాలన్నా తాము కలిసేది ఉండదని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వస్తున్న ఆయన్ను కలిసేది లేదని కుండబద్దలు కొట్టారు. యశ్వంత్ సిన్హా టీసీంసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని మమత బెనర్జీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోరారు. మద్దతిచ్చాం, ఎన్నికల్లో ఓటు వేస్తామని తెలిపారు.
