పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరో పెళ్లి చేసుకోనున్నారు. చండీగఢ్ లోని డాక్టర్ గురుప్రీత్ కౌర్ ను పెళ్లాడనున్నారు. కుటుంబీకులు, దగ్గరి వ్యక్తుల మధ్యే ఈ వివాహం జరుగుతుంది. భగవంత్ మాన్ కు ఇది రెండో వివాహం. తన మొదటి భార్య ఇంద్రప్రీత్ కౌర్ కు 6 సంవత్సరాల క్రితమే భగవంత్ మాన్ విడాకులు ఇచ్చారు. ఇద్దరు పిల్లలతో ఆమె అమెరికాలో వుంటున్నారు. సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
మొదటి భార్య ఇంద్రప్రీత్ సింగ్ కూడా భగవంత్ మాన్ సీఎం అవడాన్ని హర్షించారు. అయితే… రెండో పెళ్లికి సంబంధించిన వధువును మాత్రం భగవంత్ మాన్ తల్లి, సోదరి ఎంపిక చేశారు. వారు చూపించిన సంబంధాన్నే భగవంత్ మాన్ చేసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హాజరవుతున్నారు.