ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సంకేత్ సర్గాల్ కు సిల్వర్ పతకం లభించింది. 55 కేజీల విభాగంలో సంకేత్ సర్గార్ రెండో స్థానంలో నిలిచాడు. క్లీన్ అండ్ జెర్క్ లో 135 కేజీలు, స్పాట్చ్ లో 113 కేజీలు ఎత్తాడు. మొత్తం 248 కేజీలు ఎత్తి, రెండో స్థానంలో నిలిచి, సిల్వర్ మెడల్ సంపాదించాడు. క్లీన్ అండ్ జెర్క్ లో మొదటి ప్రయత్నంలో 135 కేజీలు ఎత్తిన సంకేత్… మిగిలిన రెండు ప్రయత్నాల్లో 139 కేజీలను ఎత్తలేకపోయాడు. క్లీన్ అండ్ జెర్క్ రెండో పర్యాయంలో సంకేత్ గాయపడ్డాడు. కానీ.. ఆఖరికి సంకేత్ స్వర్ణం కోసం శ్రమించాడు.
