Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సిద్దరామయ్యకు చేదు అనుభవం.. పరిహారాన్ని వాహనంపై విసిరేసిన మహిళ

కర్నాటక మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఇరు వర్గాల మధ్య తలెత్తిన కలహాల్లో ముగ్గురు చనిపోయారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు పరిహారం ఇవ్వగా… ఓ మహిళ.. సిద్ధరామయ్య ఇచ్చిన 2 లక్షల రూపాయలను ఆయన మొహంపైనే విసిరేసి, సంచలనం రేపింది. తమకు డబ్బులు వద్దని, న్యాయం కావాలని సిద్దరామయ్యకు తెగేసి చెప్పింది. కెరూర్ పట్టణంలో ఏర్పడిన ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు సిద్దరామయ్య వెళ్లిన సమయంలోనే ఈ ఘటన జరిగింది.

కెరూర్ పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఈ నెల 7 న ఘర్షణ జరిగింది. కత్తులు, రాడ్లతో కొందరు ఘర్షణకు దిగారు. ఇందులో ముగ్గురు హత్యకు గురయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. కెరూర్ తన నియోజకవర్గమే కావడంతో వారిని పరామర్శించేందుకు సిద్దరామయ్యవచ్చారు. ఈ సమయంలోనే బాధిత కుటుంబాలను ఆయనిచ్చిన పరిహారాన్ని తిరస్కరిస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశాయి.

Related Posts

Latest News Updates