అమెరికాలోని ఒరేగాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో 400 మీటర్లలో ప్రపంచ రికార్డు బద్దలైంది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్లో అమెరికా తార సిడ్నీ మెకాలాలిన్ ప్రపంచ రికార్డు షృష్టించింది. ఫైనల్లో మెక్లాలిన్ 50.68 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి తన పేరిటే ఉన్న రికార్డు (51.41 సెకన్లు) ను మెరుగుపరుచుకుంది. ఈ రేసులో ఫిమ్కే (52.27 సెకన్లు, నెదర్లాండ్స్), దాలియా మహ్మద్ (53.13 సెకన్లు, అమెరికా) రజత, కాంస్య పతకాలు సాధించారు. 2019లో 52.23 సెకనల్లో 400 మీటర్ల హర్డిల్స్ రేసు పూర్తి చేసి తొలిసారి రికార్డు సాధించిన మెక్లాలిన్ తన రికార్డును రెండుసార్లు బద్దలు కొట్టింది.మహిళల జావెలిన్ త్రో ఫైనల్లో భారత క్రీడాకారిణి అన్ను రాణి జావెలిన్ను 61.12 మీటర్ల దూరం విసిరి ఏడో స్థానంలో నిలువగా డిఫెండిరగ్ చాంపియన్ కెల్సీ బార్బర్ (ఆస్ట్రేలియా, 66.91 మీటర్లు) స్వర్ణం సాధించింది.
