న్యూజిలాండ్ వేదికగా వచ్చే నెల 17,18 తేదీల్లో 8 వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు భాషా, సాహిత్యాభిమానులకు స్వాగతం పలుకుతున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ప్రకటించింది. ప్రత్యక్షంగా, అంతర్జాలంలో 24 గంటలకు పైగా సాగే ఈ కార్యక్రమంలో సుమారు 50 దేశాల సాహితీ వేత్తలు పాల్గొంటారని సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మీటింగ్ సమావేశాలకు సంబంధించిన 2 వ వీడియోను సంస్థ విడుదల చేసింది.
గత కొద్ది రోజుల క్రితం ఈ సదస్సు గురించి మేము విడుదల చేసిన మొదటి వీడియో యూట్యూబ్ లో వీక్షించి స్పందించి ప్రోత్సహించిన సుమారు 13 వేల మంది సాహిత్యాభిమానులకు వేనవేల ధన్యవాదాలు ప్రకటించింది. మా ఆహ్వానాన్ని మన్నించి అనేక దేశాల నుండి ఇప్పటి దాకా స్పందించిన వక్తలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాం. ఆహ్వానిత సినీరంగ సాహితీవేత్తలు, సాహితీ రంగంలో నిష్ణాతులు న్యూజీలాండ్ లో వ్యక్తిగతంగా పాల్గొంటున్నారని వంగూరీ ఫౌండేషన్ పేర్కొంది.