Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీ మేకర్స్

కలర్ ఫొటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం రైటర్ పద్మభూషన్. ప్రస్తుతం ఈ చిత్రం అందరి ప్రశంసలను అందుకుంటోంది. మహేశ్ బాబు, రష్మిక కూడా తెగ మెచ్చుకున్నారు. ఫ్యామిలీ తప్పక చూడాల్సిన చిత్రమని తెలిపారు. అయితే… ఈ సినిమా మేకర్స్ మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫిబ్రవరి 8 న తెలుగు రాష్ట్రాలలోని మహిళలకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తామని ప్రకటించింది. 60 నుంచి 70 వేల మంది మహిళలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తామని నిర్మాత శరత్ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో పాసులు ఇస్తామని పేర్కొన్నారు.

 

Related Posts

Latest News Updates