చైనా అధ్యక్షుడిగా జీ జిన్ పింగ్ ((Xi Jinping) ముచ్చటగా మూడోసారి ఏకపక్షంగా ఎన్నికయ్యారు. సెంట్రల్మిలిటరీ కమిషన్ చైర్మన్ గా కూడా ఆయనే ఎన్నిక కావడం విశేషం. మరో 5 సంవత్సరాల పాటు జిన్ పింగ్ కు అధ్యక్ష బాధ్యతలు అప్పజెబుతూ చైనా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇక.. చైనా ఉపాధ్యక్షుడిగా హాన్ జంగ్ ఎన్నికయ్యారు. ఇప్పుడు మొత్తం కీలకమైన 3 అధికారాలు జిన్ పింగ్ చేతుల్లోకే వెళ్లాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, దేశాధ్యక్ష పదవి, మిలటరీ కమిషన్ చైర్మన్ పదవి… ఈ మూడూ ఆయన ఒక్కడి చేతుల్లోనే వుంది.
చైనా ఉపాధ్యక్షుడిగా హాన్ జంగ్ ఎన్నికయ్యారు. మార్చి 10న జరిగిన సమావేశంలో 2,952 ఓట్లు ఏకగ్రీవంగా జిన్‌పింగ్‌కు పోలయ్యాయి. మూడవ సారి దేశాధ్యక్షుడిగా ఎన్నికైన జీ జిన్‌పింగ్ .. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్‌లో రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. స్టాండింగ్ కమిటీ చైర్మెన్‌గా ఎన్నికైన జావో లెజితో పాటు ఉపాధ్యక్షుడు హాన్ జంగ్ కూడా రాజ్యాంగం(Constitution) మీద ప్రమాణం చేశారు.