రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న పోరు ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తున్న పోరు కాదని, ఇద్దరు వ్యక్తుల గుర్తింపు కోసం కూడా కాదని అన్నారు. విశాల భారత పరిరక్షణ కోసం జరిగే పోరాటమని ప్రకటించారు.
విద్వేష పూరిత ప్రసంగాలు సమాజానికి ఎంత మాత్రమూ మంచివి కావని యశ్వంత్ సిన్హా హితవు పలికారు. ఒకే వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ సిన్హా సూటిగా ప్రశ్నించారు.
దేశం నాశన మవుతుంటే మోదీ చూస్తూ వుండిపోతున్నారని సిన్హా మండిపడ్డారు. మోదీ ప్రతినెలా మన్ కీ బాత్ చెబుతారని, కానీ ప్రజల మన్ కీ బాత్ మాత్రం వినరని ఎద్దేవా చేశారు. మోదీకి ఒక్కసారి కూడా మీడియా ముందుకు వచ్చే ధైర్యమే లేదని సిన్హా విమర్శించారు.