విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ లో తన నామినేషన్ ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ఎన్సీపీ నుంచి శరద్ పవార్, టీఆర్ ఎస్ నుంచి మంత్రి కేటీఆర్, సమాజ్ వాదీ నుంచి అఖిలేశ్ యాదవ్, నేషన్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, డీఎంకే తరపున ఏ. రాజా, వామపక్షాల నుంచి సీతారాం ఏచూరీ, టీఎంసీ నుంచి సౌగతా రాయ్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా టీఎంసీ సీనియర్ నేత సౌగతా రాయ్ మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికలనేవి ఇరు పార్టీల మధ్య పోటీ కాదని, సైద్ధాంతికపరమైన పోటీ అని చెప్పుకొచ్చారు. సెక్యూలరిజం వర్సెస్ కమ్యూనలిజం మధ్య జరుగుతున్న పోటీ అని అభివర్ణించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హానే సరైన అభ్యర్థి అని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు.
Opposition's Presidential polls candidate Yashwant Sinha files his nomination at the Parliament in Delhi pic.twitter.com/2BGztPZwmB
— ANI (@ANI) June 27, 2022