వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ తనను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని పిటిషన్ లో కోరారు. అలాగే తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేపట్టాలని కూడా కోరారు. తన న్యాయవాది సమక్షంలోనే విచారణ చేయాలని పలుమార్లు కోరినా… సీబీఐ పట్టించుకోలేదన్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో శుక్రవారం ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
వివేకా హత్య కేసులో ఏ4 నిందితుడిగా వున్న దస్తగిరిని ఇప్పటి వరకూ సీబీఐ అరెస్ట్ చేయలేదని, ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా వ్యతిరేకించలేదన్నారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా…. కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. దస్తగిరి అక్కడ ఇక్కడ విని, చెప్పిన మాటల ఆధారంగానే సీబీఐ విచారణ సాగుతోందని, అలాగే తాను చెప్పిన విషయాలను విచారణ అధికారి మార్చేస్తున్నారని పేర్కొన్నారు.