Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వైసీపీ గౌరవ అధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామా.. వైఎస్ షర్మిలకు తోడుగా వుంటానని ప్రకటన

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. తన కుమార్తె, వైఎస్ షర్మిలకు అండగా వుండేందుకే ఈ నిర్ణయమని ఆమె అన్నారు. వైసీపీ ప్లీనరీ వేదికగా విజయమ్మ ఈ ప్రకటన చేశారు. వైసీపీ నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు ప్రస్తుతం నా అవసరం వుంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ప్రజలకు నా ఇద్దరు బిడ్డలు అండగా వుంటారు. మీ మద్దతు వారికి కావాలి. తల్లిగా జగన్ కు ఎప్పుడూ నా మద్దతు వుంటుంది అని వైఎస్ విజయమ్మ తెలిపారు.

 

వైఎస్సార్ బిడ్డగా షర్మిల వైఎస్సార్ టీపీ పెట్టుకుందని విజయమ్మ పేర్కొన్నారు. తండ్రి ఆశయాల మేరకు ప్రజా సేవ చేయాలనే నిర్ణయించుకుందన్నారు. వైఎస్సార్ భార్యగా, బిడ్డకు తల్లిగా షర్మిలకు అండగా వుండాలనుకుంటున్నా. ఏపీ ప్రయోజనాల కోసం వైఎస్ జగన్ ఇక్కడ అవసరమని విజయమ్మ పేర్కొన్నారు. తెలంగాణ కోడలిగా షర్మిల అక్కడ ప్రజాసేవలో ఉండాలనుకుందని, తెలంగాణలో ఏపీ కంటే ముందుగానే ఎన్నికలు వస్తున్నాయని విజయమ్మ బాంబు పేల్చారు.

 

తమ కుటుంబంతో ప్రజల అనుబంధం 45 సంవత్సరాలుగా కొనసాగుతోందన్నారు. వైఎస్ ప్రతి మనిషినీ ప్రేమించారని, తాము కష్టాల్లో వుంటే ప్రజలే ఓదార్చారని గుర్తు చేసుకున్నారు. సంక్షేమం జగన్ లక్ష్యమని, వైఎస్ జగన్ మాస్ లీడర్ అని అన్నారు. జగన్ యువతకు రోల్ మోడల్ అని, జగన్ ను చూసి గర్వపడుతున్నానని ప్రకటించారు. తన బిడ్డ జగన్ ను ప్రజలే అప్పగించానని, తన బిడ్డను నడిపించాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుందని విజయమ్మ అన్నారు. ప్రజలతో ఇలాగే బంధం కొనసాగాలని కోరుకుంటున్నానని విజయమ్మ ఆకాంక్షించారు.

Related Posts

Latest News Updates