వైసీపీ నిర్వహిస్తున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ- గుంటూరు ప్రధాన రహదారి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఈ ప్లీనరి నిర్వహిస్తున్నారు. ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్సార్ ప్రాంగణంగా నామకరణం చేసేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత మొదటి సారి ఈ ప్లీనరి జరుగుతన్న నేపథ్యంలో పార్గీ ఈ ప్లీనరీని ఘనంగా నిర్వహిస్తోంది. మరోవైపు ప్లీనరీ ప్రాంగణాన్ని ఇప్పటికే మంత్రులు పరిశీలించారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ ఛార్జీలకు పాస్ లు కూడా జారీ చేశారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
8,9 తేదీల్లో జరిగే ఈ ప్లీనరీ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. 8 గంటల నుంచి 10 గంటల వరకూ సభ్యుల రిజిస్ట్రేషన్ వుంటుంది. ఉదయం 10 గంటలకు పార్టీ జెండాను వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత ప్రార్థనలు, వైఎస్సార్ కు నివాళులు అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల అవుతుంది. దీనిని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రవేశపెడతారు. మొదటి రోజు 5 అంశాలపై చర్చిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.