మాజీ ఎంపీ, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు. తెలంగాణ రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి వీరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా వైఎస్సార్ తో వున్న అనుభవాలను డీఎస్ షర్మిళతో పంచుకున్నారు. అయితే.. డీఎస్ సంచలన వ్యాఖ్యలు చేవారు. భవిష్యత్తులో షర్మిళ ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం ఖాయమన్నారు. వైఎస్సార్ కూడా సీఎం అవుతారని తాను 2003 లో చెప్పానని గుర్తు చేసుకున్నారు. షర్మిళ ఓ ఐరన్ లేడీ అని, తన రాజకీయ అనుభవంతో చెబుతున్నానని, షర్మిళ కచ్చితంగా సీఎం అవుతారని డీఎస్ పేర్కొన్నారు.